Bhakthi Rasaayanamu Chapters Pages
సంపాదకీయము
పాఠక మహాశయులారా!
ఈ భక్తిరసాయన మను గ్రంథముతో మండలికి నేడవవత్సర ప్రారంభమయినది. ఇంతవరకు మండలి యెట్టి కృషి చెసినదియు మీకువిదితమే. మండలికి మూలధనము లేక పోవుట, కావలసిన పోషకవర్గము లేకపోవుట, ఉన్న పోషక వర్గమువారివలన రావలసినది రాకపోవుట, యీ కారణములచే నేటికి రెండువేల రూప్యములకు పైగా ఋణమైనది. ఐనను తనధర్మము తానిర్వర్తించుచున్నది.
ఇట్టి సంస్థల పురోభివృద్ధికి వచ్చునటులతోడ్పడ గల సమర్థులు, ఆసక్తులు బహుముఖముల దేశమున కలరు. వారి అందరి తోడ్పాటును మేము కోరుచుంటిమి. మీ సహాయమువలన మండలిలో నుత్తమ గ్రంథముల ప్రకటించి లోకమున కందివ్వ గలమని మనవి చేయుచున్నాము.
రెండు మూడు సంవత్సరములనుండి రాజపోషకులు, పోషకులు, సభ్యులు, చందాదారులు తమ పారితోషికమును మండలికి పంపలేదు. జాబులు వ్రాసినను సమాధానముగూడ లేదు. అట్టివారందరు తమతమ పారితోషికములను వెంటనే పంపి మండలిని చిరస్థాయిగా నుండునట్లు చేయగోరు చున్నాము.
ఈ విషయ మింతకు పూర్వము వెలువడిన గోవింద దామోదర స్తోత్రమను గ్రంథమున సూచించితిమి. కొలదిమంది మాత్రమె మా విన్నపమును ఆలకించిరి. వారికి మాకృతజ్ఞత.
ఇటుపైనుండి షూమారు 125 పేజీలకు తక్కవకాకుండు గ్రంథములు వెలువరించ వలయునని మాసంకల్పము. ఇందులకు పోషక, పోఠకలోకము మిక్కిలి సహకరింప ప్రార్థన.
మిత్రులు, పండితులు,సాగరు విశ్వవిద్యాలయమున ఉపన్యాసకులు శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రీగారు (ఎం.ఎ.ఎం.లిట్.పి.హెచ్.డి) మా ప్రార్థన నంగీకరించి ఈ భక్తిరసాయనమును వ్రాసి యిచ్చిరి. వారికి మా కృతజ్ఞతాపూర్వక వందనములు.
విజయ చైత్రము } వ్యవస్థాపకుడు:
2-4-1953 బులుసు సూర్యప్రకాశశాస్త్రి